విరాట్ కోహ్లికి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గాయం అయిందా, లేదా బౌలింగ్ చేస్తున్న సమయంలో గాయం అయిందా.. అన్న వివరాలు మాత్రం తెలియలేదు. మరోవైపు కోహ్లి గాయంపై బీసీసీఐ ఎలాంటి ప్రకటనా చేయలేదు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉండగా.. టీమిండియాకు ఇప్పుడు భారీ షాక్ తగిలింది. భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి గాయపడ్డాడు. నిన్న నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా కోహ్లి కుడి చేతి బొటన వేలికి గాయమైంది. దీంతో కోహ్లి గాయంతో చాలా సేపు విలవిల్లాడిపోయాడు. అయితే ఫిజియో పాట్రిక్ కోహ్లికి ప్రథమ చికిత్స చేశాడు. దీంతో కోహ్లికి కొంత బాధ నుంచి ఉపశమనం కలిగింది.
అయితే విరాట్ కోహ్లికి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గాయం అయిందా, లేదా బౌలింగ్ చేస్తున్న సమయంలో గాయం అయిందా.. అన్న వివరాలు మాత్రం తెలియలేదు. మరోవైపు కోహ్లి గాయంపై బీసీసీఐ ఎలాంటి ప్రకటనా చేయలేదు. మరి గాయం తగ్గిందా, లేదా అన్న వివరాలు కూడా తెలియరాలేదు. అయితే ప్రాక్టీస్ సెషన్ ముగిశాక మాత్రం కోహ్లి ఐస్ గ్లాస్‌లో వేలు పెట్టుకుని బయటకు రావడం కనిపించింది.
కాగా ఈ నెల 5వ తేదీన టీమిండియా సౌతాఫ్రికాతో వరల్డ్ కప్‌లో తన తొలి మ్యాచ్‌ను ఆడనున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే కోహ్లికి ఇప్పుడు అయిన గాయం అటు జట్టు సభ్యులతోపాటు టీం మేనేజ్‌మెంట్‌ను కూడా కలవరానికి గురి చేస్తోంది. దీంతో కోహ్లి భారత్ ఆడే తొలి వరల్డ్ కప్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా, లేదా అన్నది సందేహంగా మారింది. అయితే కోహ్లికి గాయం నుంచి కోలుకునేందుకు ఇంకా 3 రోజుల సమయం ఉన్నందున అతను మ్యాచ్‌లో ఆడుతాడని కూడా తెలుస్తోంది. మరి ఈ నెల 5వ తేదీన కోహ్లి మ్యాచ్ ఆడుతాడా, లేడా అన్నది తెలియాలంటే.. మరో 3 రోజుల వరకు వేచి చూడక తప్పదు..!