MSD : ధోనీనా మజాకా..ఏపీలో 41 అడుగుల కటౌట్‌

-

ఇండియన్ క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టీమిండియాలో ఎన్నో విజయాలు అందించి చరిత్ర సృష్టించాడు ధోని. అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మూడు టోర్నీలు అందించిన కెప్టెన్ గా నిలిచాడు. ఇక ధోని హెలికాప్టర్ షాట్… ఆయన కెరీర్ లోనే ద బెస్ట్. అలాంటి ద గ్రేట్ మ్యాన్ బర్త్డే ఇవాళ.

నేడు మహేంద్రసింగ్ ధోని 41వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ నేపథ్యంలో 41 అడుగుల కటౌట్ ను ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆయన ఫ్యాన్స్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ధోనికి 41 అడుగుల కటౌట్ ను ఆయన అభిమానులు ఏర్పాటు చేశారు. కాగా 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ధోని సిక్స్ కొట్టి మ్యాచ్ గెలిపించిన షార్ట్ స్టిల్ ను ఈ కటౌట్ కోసం ఎంచుకున్నారు. సిక్స్ కొట్టి బాల్ వైపు చూస్తుంటే ధోనీని ఈ కటౌట్ లో చూడొచ్చు. ప్రస్తుతం ఈ కటౌట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news