ఒలింపిక్స్ కు ముహూర్తం ఫిక్స్

-

కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచంలోని అన్ని క్రీడా టోర్నీలన్నీ వాయిదా వేసిన సంగతి తెలిసిందే.. అయితే ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఒలింపిక్ క్రీడలు కీడా వాయిదా వేశారు. ఇప్పుడు కరోనా మహమ్మారి కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా పడ్డ ఒలింపిక్స్ కు కొత్త ముహూర్తం కుదిరింది.

ఈ సంవత్సరం జూలై24 న ఆరంభమై ఆగస్టు 9 వరకూ జరగాల్సిన క్రీడలను 2021 లో జూలై 23 ఆగస్టు 8 తేదీల మధ్య నిర్వహించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, జపాన్ దేశాలు నిర్ణయించాయి. వేసవిలో ఒలింపిక్స్ నిర్వహించాలని మొదట భావించినా..యూరో కప్ ఫుట్ బాల్, నార్త్ అమెరికా క్రీడా లీగ్ లు అదే సమయంలో ఉండటంతో జూలై ఆగస్టు నెలలే సరైనవిగా టోక్యో ఒలింప్ నిర్వహక కమిటీ భావించింది. ఈ మెగా ఈవెంట్ ను వచ్చే ఏడాదికి వాయిదా వేయటం వల్ల బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లనుందని కమిటీ అంచనా వేస్తోంది.

ఒలింపిక్స్ కోసం జపాన్ రూ.2 లక్షల కోట్లకు పైగానే ఖర్చు చేస్తోంది. క్రీడలు అనుకున్న సమయానికి జరగకపోవడంతో ఇప్పుడు ఈ ఖర్చు భారీగా పెరుగుతుందని క్రీడల నిర్వాహక కమిటీ ప్రెసిడెంట్ యొషిరో మోరీ అన్నాడు. ఈ పోటీల కోసం ప్రస్తుతం కట్టిన స్టేడియాలను అద్దెకు ఇవ్వాలని నిర్ణయించి టోక్యో కమిటీ ఒప్పందాలు కూడా చేసుకుంది. ఇప్పుడు ఈ అద్దెలన్నింటినీ జపానే భరించాల్సి ఉంది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లకు కూడా డబ్బులు తిరిగి చెల్లించాల్సి ఉంది. మొత్తంగా చూస్తే ఒలింపిక్స్ ఎప్పుడు తమకు శాపంగానే మారుతోందని ఆ దేశం భావిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news