IPL 2023 లో అరుదైన క్లబ్‌లో చోటు దక్కించుకున్నాడు రవీంద్ర జడేజా. IPL లో చెన్నై ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మరో ఘనత సాధించారు. ఐపీఎల్ చరిత్రలో 1000కి పైగా పరుగులు చేసి, 150కి పైగా వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ల జాబితాలోకి చేరారు.
ఈ లిస్టులో డ్వెన్ బ్రావో (1560 పరుగులు, 183 వికెట్లు), సునీల్ నరైన్ (1046 పరుగులు, 183 వికెట్లు), రవీంద్ర జడేజా (2677 పరుగులు, 150 వికెట్లు) మాత్రమే ఉన్నారు. అటు ఐపీఎల్ చరిత్రలో దీపక్ చాహర్ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో CSK బౌలర్ దీపక్ చాహర్ 3వ స్థానంలో నిలిచారు. దీపక్ ఇప్పటివరకు పవర్ ప్లేలో 53 వికెట్లు పడగొట్టగా… పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు SRH బౌలర్ భువనేశ్వర్ కుమార్ (61) పేరిట ఉంది. భువి తర్వాత వరుసగా సందీప్ శర్మ (55), దీపక్ చాహార్ (53), ఉమేష్ యాదవ్ (53), జహీర్ ఖాన్ (52) ఉన్నారు.