IND vs WI : టీ20 క్రికెట్‌లో రోహిత్‌ సేన కొత్త చరిత్ర..

-

వెస్టిండీస్ తో ఐదు టి20 సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సొంతం చేసుకుంది. టీమిండియా ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ తో ఈ విజయం సాధించింది. ఐదు మ్యాచ్ ల సిరీస్ ను 3-1 ఆదిత్యంతో తన ఖాతాలో వేసుకుంది టీమిండియా. ఫ్లోరిడా వేదికగా జరిగిన నాలుగో టి20 లో 59 పరుగుల తేడాతో వెస్టిండీస్ జట్టుపై గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా.

ఈ నేపథ్యంలోనే రోహిత్‌ సేన ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. వెస్టిండీస్‌ పై టీమిండియాకు ఇది వరుసగా ఐదో టీ 20 సిరీస్‌ విజయం కావడం విషేషం. ఇక అంతర్జాతీయ టీ 20 క్రికెట్‌ లో ఐలాండ్‌ దేశాలపై ఇండియాకు ఇది 13వ సిరీస్‌ విజయం. ఇది ఇలా ఉండగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో ప్రపంచ రికార్డు దిశగా అడుగులు వేస్తున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు బాడిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ రెండో స్థానానికి ఎగబాకాడు. విండీస్ తో జరిగిన నాలుగో t20 లో 3 సిక్సర్లు కొట్టిన రోహిత్ శర్మ… అన్ని ఫార్మాట్లలో సిక్సర్ల సంఖ్యను 477కు పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే అతను పాక్ మాజీ పవర్ హిట్టర్ షాహిద్ అఫ్రిదిని అధిగమించాడు. ఈ జాబితాలో వెండిస్ విధ్వంసకర బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news