రెండేళ్ల తరువాత మాడవీధుల్లో వెంకన్న దర్శనం..

-

కరోనా రక్కసి కారణంగా ఏడుకొండల శ్రీవేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు గత రెండు సంవత్సరాలుగా ఆలయం లోపలే
నిర్వహించారు టీటీడీ అధికారులు. అయితే.. ఇప్పుడు.. ఈసారి తిరుమల మాడవీధుల్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తొలిసారి బ్రహ్మోత్సవాల సమయంలో రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని టీటీడీ రద్దు చేసింది. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారని భావిస్తున్న అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. సామాన్య భక్తులకూ స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలన్న ఉద్దేశంతోనే రూ. 300 టికెట్ దర్శనాన్ని రద్దు చేశారు అధికారులు.

Tirumala TTD Brahmotsavam 2018 Full Schedule | Garuda Seva Timings Dates

సెప్టెంబరు 27 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అదే సమయంలో పెరటాసి మాసం కూడా ప్రారంభం కానుండడంతో తమిళనాడు నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారని భావిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రత్యేక ప్రవేశం, సర్వదర్శనం ఒకేసారి కల్పించాలంటే ఇబ్బందిగా ఉంటుందని భావిస్తున్న టీటీడీ సర్వదర్శనానికి వచ్చే భక్తులకు ప్రాధాన్యం ఇచ్చే ఉద్దేశంతో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల జారీని నిలిపివేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news