Ind vs Sl : కెప్టెన్ గా చరిత్ర తిరగరాసిన హిట్ మ్యాన్..

-

బెంగళూరు టెస్ట్‌లో భారత్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. శ్రీలంక జట్టు పై ఏకంగా 238 పరుగుల తేడాతో గెలుపొందింది టీం ఇండియా. రెండో ఇన్నింగ్స్ లో లో కేవలం 208 పరుగులకే ఆల్ అవుట్ అయిన శ్రీలంక… టీం ఇండియాకు గ్రాండ్ విక్టరీని అందించింది.

అయితే టీమిండియా జట్టు కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన తొలి నాళ్లలోనే రోహిత్ శర్మ రికార్డు ల మీద రికార్డ్ లు కొట్టేస్తున్నారు. మూడు ఫార్మాట్లలో ఫుల్ టైం కెప్టెన్ గా మారి ఆడిన తొలి సీరీస్ లోని ప్రత్యర్థి జట్టు ను క్లీన్ స్వీప్ చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించారు.

ఫుల్‌ టైం కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంత గడ్డపై వెస్టిండీస్ జట్టును వన్డే, టి20 సిరీస్ లలో రోహిత్ శర్మ వైట్ వాష్‌ చేశాడు. ఇక తాజాగా శ్రీలంక టెస్ట్ సిరీస్ లో 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేయడం ద్వారా మూడు ఫార్మాట్లలో అరంగ్రేటం సిరీస్‌లలో క్లీన్ స్వీప్‌ విజయాలు అందించిన కెప్టెన్ గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news