కోహ్లీ లేకపోవడం బిగ్గెస్ట్ మైనస్: సచిన్

-

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడు టెస్ట్ లకు జట్టుకి అందుబాటులో లేకపోవడం ఆస్ట్రేలియాతో జరిగే టెస్టుల్లో భారత్ అవకాశాలను ప్రభావితం చేస్తుందని టీం ఇండియా మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ అన్నారు. రోహిత్ శర్మ ఫిట్ గా, అందుబాటులో ఉంటే టెస్టుల్లో భారత్ కోసం ఓపెనింగ్ చేయాలని సచిన్ సూచించాడు. పరిమిత ఓవర్ల సిరీస్‌ కు భారత్ సన్నద్ధమవుతున్న తరుణంలో రోహిత్, ఇషాంత్ శర్మ ఫిట్‌నెస్‌పై ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకపోవడమనేది కచ్చితంగా టీం ఇండియాకు దెబ్బే అన్నాడు. అయితే ఇది వేరొకరు అవకాశంగా మార్చుకోవచ్చు అని వ్యాఖ్యానించాడు. విరాట్ కోహ్లీ డిసెంబర్ 17 నుంచి అడిలైడ్‌లో జరిగే ఓపెనింగ్ టెస్ట్ – డే-నైట్ మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడు. ఆ తర్వాత ఇండియా వచ్చేస్తున్నాడు. పుజారా టీం ఇండియా బ్యాటింగ్ బలాన్ని మోయాలని సచిన్ సూచనలు చేసాడు.

Read more RELATED
Recommended to you

Latest news