టీమిండియాకు అదిరిపోయే శుభవార్త

టీమిండియాకు అదిరిపోయే శుభవార్త. భారత స్పేస్ బౌలర్ మహమ్మద్ షమీ కరోనా నుంచి కోలుకున్నాడు. బుధవారం నిర్వహించిన పరీక్షలు షమీకి నెగిటివ్ రిపోర్టు వచ్చింది. ఈ నెల 17న కోవిడ్-19 భారిన పడ్డ షమీ ముందుగా ఆస్ట్రేలియాతో, ఆ తర్వాత దక్షిణాఫ్రికా తో టి20 సిరీస్ లకు దూరమయ్యాడు. వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరిగే ప్రపంచ కప్ టి20 టోర్నీ కోసం షమీని స్టాండ్ బైగా ఎంపిక చేశారు.

కాగా, మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికా తో తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి టి20 మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. సొంత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్నిత 8 ఓవర్లలో వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యాన్ని భారత్ అలవొకగా చేదించింది. ఈ క్రమంలోనే టీమిండియా అత్యంత చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది.