Shikhar Dhawan Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధవన్

-

Shikhar Dhawan: టీమిండియా కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా జట్టుకు కీలక ప్లేయర్ దూరం కాబోతున్నాడు. టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ సంచలన ప్రకటన చేశారు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు శిఖర్ ధావన్ ప్రకటన చేయడం జరిగింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు. ఇంటర్నేషనల్ అలాగే డొమెస్టిక్ క్రికెట్ లో తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు ఓ వీడియో ద్వారా శిఖర్ ధావన్ తెలపడం జరిగింది.

Shikhar Dhawan retirement

దేశం తరఫున ఆడినందుకు చాలా గర్వంగా ఉందని… ఈ సందర్భంగా తెలిపారు శిఖర్ ధావన్. ఇక తన ప్రయాణంలో తనకు ఎంతో మంది.. సహాయం చేశారని…వారి వల్ల ఈ స్థాయికి వచ్చానని కూడా తెలిపారు. అయితే… టీమిండియాలో గత కొన్ని రోజులుగా… శిఖర్ ధావన్ కు అవకాశం రాలేదు. దీంతో విసిగిపోయిన శిఖర్ ధావన్ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటి వరకు శిఖర్ ధావన్ కెరీర్ లో టీమిండియా తరఫున 34 టెస్టులు ఆడాడు. అలాగే t20 లు 68 ఆడాడు. వన్డే మ్యాచ్లో 167 ఆడాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version