IND vs AUS : మొదటి టీ20లో ఓటమి…ఏం బౌలింగ్, ఫీల్డింగ్ ఏందిరా సామి అంటూ ట్రోలింగ్

-

IND vs AUS :  ​ఇండియాపై విజయం సాధించింది ఆస్ట్రేలియా. నాలుగు వికెట్ల తేడాతో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠగా సాగిన తొలి టీ20లో భారత జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. జట్టు సమష్టిగా రాణించి విజయాన్ని అందుకుంది. తొలి టీ 20 లో చెత్త బౌలింగ్, ఫీల్డింగ్ తో భారత్ 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

ఇటీవల కాలంలో ఏనాడు లేనంతగా భారత యువ ఆటగాళ్లు చెత్త ఫీల్డింగ్ చేస్తే, ప్రధాన పేసర్లు భారీగా పరుగులు ఇవ్వడంతో రోహిత్ సేన మూల్యం చెల్లించుకుంది. బౌలర్లు భారీగా పరుగులు ఇస్తుంటే, ఏమీ చేయలేక కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలోనే అసహనం వ్యక్తం చేశాడు.

ఇటీవల ముగిసిన ఆసియా కప్ 2022లో కూడా భారత్ చెత్తగా ఫీల్డింగ్ చేసి మూల్యం చెల్లించుకుంది. పాకిస్తాన్ తో జరిగిన కీలక మ్యాచ్ లో ఆసిఫ్ ఆలీ ఇచ్చిన సునాయాస క్యాచ్ ను ఆర్షద్వీప్ సింగ్ వదిలేశాడు. జీవనాధారం అనంతరం ఆసిఫ్, ఓ సిక్స్, రెండు ఫోన్లు బాది పాక్ విజయానికి బాటలు వేశాడు. అదే టోర్నీలో భారత్ బౌలర్లు కూడా భారీగా పరుగులు ఇచ్చారు. ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ సైతం విఫలమయ్యాడు. బౌలింగ్, ఫీల్డింగ్ కారణంగానే ఆసియా కప్ 2022 సూపర్ 4 నుంచి రోహిత్ సేన నిష్క్రమించింది. అయితే బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఇండియా విఫలం కావడంపై ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news