విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దుబాయ్‌లో వీరిద్దరూ ఆర్‌సీబీ ఆటగాళ్ల మధ్య సంబరాలు చేసుకున్నారు. శుక్రవారం ఆర్‌సీబీ ఆటగాళ్ల క్వారంటైన్ ముగియడంతో అందరు ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆర్‌సీబీ ఆటగాళ్ల మధ్య కోహ్లీ కేక్ కట్ చేసి తన శ్రీమతికి తినిపించాడు. అలానే అనుష్క కూడా విరాట్‌కి కేక్ తినిపించారు.
ఈ సందర్భంగా వీరిద్దరికి అందరూ విషెష్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోని ఆర్సీబీ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. అలాగే టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఇటీవల తన మనసుకు నచ్చిన అమ్మాయి ధనశ్రీ వర్మతో నిశ్చితార్ధం జరుపుకున్న విషయం తెలిసిందే. దీంతో చహల్ కూడా తోటి ఆటగాళ్ళ మధ్య కేక్ కట్ చేశాడు. అందరూ అతనికి విషెష్ చెప్పి కేక్ తినిపించారు.
7 days of quarantine in Bengaluru followed by 7 days in Dubai and 6 COVID tests later, the team finally got a chance to spend quality time together in a dedicated private beach and a state of the art team room, within the secure bio bubble.#PlayBold #IPL2020 #WeAreChallengers pic.twitter.com/UweXBqhjlv
— Royal Challengers Bangalore (@RCBTweets) August 29, 2020