లుక్‌ మార్చిన స్ప్రైట్‌ బాటిల్‌….కిక్క్‌లో తేడా ఏం లేదు..!! 

-

స్పైట్ డ్రింక్‌ బాటిల్‌ ఆకుపచ్చ రంగులో ఉంటుందని మనందరికి తెలసిన విషయమే.. కానీ ఇకపై ఆకుపచ్చ ఉండదు. పారదర్శకంగా ఉండబోతుంది. డ్రింక్‌లో ఎలాంటి మార్పు రాదు.. ఇందుకు సంబంధించి మాతృసంస్థ కోకాకోలా అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. కానీ లుక్‌లోనే మార్పులు చేశారు. ఎందుకిలా..ఏదో ఒక కారణం లేకుండా అయితే ఉండదు.. కారణం ఏంటంటే..
ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా స్ప్రైట్ తెలుపు రంగు బాటిళ్ళ‌లోనే క‌న‌ప‌డ‌నుంది. ఇందుకు సంబంధించిన యాడ్‌ను కూడా వినూత్న రీతిలో రూపొందిచింది. ”లోప‌ల అదే స్ప్రైట్.. బ‌య‌ట లుక్ మాత్రం మారింది”.. ”కొత్త బాటిల్.. అదే స్ప్రైట్” అంటూ ఓ యాడ్ రూపొందించింది. 1961లో USలో ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుండి 60 సంవత్సరాలకు పైగా స్ప్రైట్ బాటిల్‌ పచ్చరంగులోనే ఉంది.
ఇంతకీ కలర్‌ ఎందుకు మార్చాలని అనుకున్నారంటే… ఈ ప్లాస్టిక్ బాటిళ్ళ‌ను రీసైక్లింగ్ చేసే స‌మ‌యంలో ఆకుప‌చ్చ రంగులో అవి ఉంటే కొన్ని సమ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయ‌ట‌. పర్యావరణహితం కోసం త‌మ‌ బాటిళ్ళ‌ను రీసైక్లింగ్‌కు అనుకూలంగా ఉత్పత్తి చేస్తున్నామ‌ని ఆ సంస్థ తెలిపింది. రీసైక్లింగ్ చేసిన ప్లాస్టిక్ నాణ్యతతో ఉండడం కోసం ఈ నిర్ణయం తీసుకుందట.. ఈ తెల్ల‌ బాటిళ్ళ‌లో స్ప్రైట్ ఆగస్టు 1 నుంచి అందుబాటులోకి రానుంది.
కేవలం ప్లాస్టిక్ పెట్ బాటిళ్ళు మాత్రమే కాకుండా.. గాజు సీసాల రంగును కూడా మారుస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. గాజు బాటిళ్లను వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. స్ర్పైట్‌కు ఇండియాలో కూడా మంచి డిమాండ్ ఉంది. ఇంటికి నలుగురు వచ్చారంటే.. వెంటనే వెళ్లి రెండు లీటర్ల్‌ స్ప్రైట్‌ తెప్పిస్తారు. ఇది పేరుకు శీతలపానియమే అయినా.. అన్ని డ్రింక్స్‌లా కాదు..మంచిదే అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది.
మొత్తానికి ఈ రంగుమారిన స్ప్రైట్‌ బాటిల్‌ మార్కెట్‌లోకి త్వరలోనే రానున్నాయి. కంపెనీ మంచి కాస్‌తో కలర్‌ అయితే మార్చింది కానీ…కొన్నిసార్లు చిన్నచిన్న మార్పులే పెద్ద పెద్ద ఫలితాలను తెచ్చిపెడతాయి.. ఆ ఫలితాలు లాభం అయినా అవ్వొచ్చు, నష్టం అయినా అవ్వొచ్చు. మూతపడే స్టేజ్‌లో ఉన్న కోల్గెట్‌ పేస్ట్‌ కంపెనీని చిన్న ఐడియా..పేస్ట్‌ హోల్‌ సైజ్‌ పెద్దది చేయమని ఓ సామాన్య ఉద్యోగి ఇచ్చిన ఐడియా వల్ల కంపెనీ తిరిగి లాభాల బాట పట్టింది..సో వ్యాపారం అంటే కత్తిమీద సాము లాంటిదే.. ఏ నిర్ణయం ఎక్కడి వరకూ తీసుకెళ్తుందో చెప్పలేం..!
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news