శ్రీజ -కళ్యాణ్ దేవ్ విడిపోనున్నారా.. ఇందులో నిజమెంత..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ కొణిదెల ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. మెగా కుటుంబంలో మేంబర్ కావడం వల్ల ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. అందుకు తగ్గట్టుగానే శ్రీజ సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటూ తన కుటుంబానికి సంబంధించి కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ మధ్యకాలంలో శ్రీజ తన వ్యక్తిగత విషయంపై ఏదో ఒక వార్త ఎప్పుడు వైరల్ గా మారుతూనే ఉంటుంది. ఇదంతా ఇలా ఉండగా శ్రీజ బర్తడే సందర్భంగా ఆమె భర్త కళ్యాణ్ దేవ్ షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు చర్చనియంశంగా మారుతోంది వాటి గురించి తెలుసుకుందాం.

నవంబర్ 9వ తేదీన శ్రీజ బర్త్ డే సందర్భంగా ప్రతిసారి ఆమెకు విషెస్ చెప్పే కళ్యాణ్ దేవ్.. ఈసారి మాత్రం ఎలాంటి పోస్ట్ చేయకుండా కేవలం తను ఒక వేకేషన్ లో దిగిన ఫోటోని షేర్ చేస్తూ “లైఫ్ అంత ఈజీగా సాగదు మనమే స్ట్రాంగ్ అవ్వాలి” అంటు ఒక ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారుతోంది. దీంతో కళ్యాణ్ దేవ్, శ్రీజ విరిపోతున్నారు అనే వార్తలకు మరింత బలాన్ని చేకూర్చిందని చెప్పవచ్చు.

ఇక గడిచిన ఆరు నెలల నుంచి వీరిద్దరి మధ్య పలు మనస్పర్ధలు కారణాల చేత విడిపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక అంతే కాకుండా శ్రీజ మరొక వివాహం చేసుకోబోతోందని కళ్యాణ్ దేవ్ కూడా మరొక వివాహం చేసుకోబోతున్నారని విషయాలు వైరల్ గా మారుతూ ఉన్నాయి. అయితే తాజాగా కళ్యాణ్ షేర్ చేసిన పోస్ట్ ను బట్టి చూస్తే వీరిద్దరి నిజంగానే విడిపోతున్నారని వార్తలు బలంగా నమ్మేలా ఉన్నాయని పలువురు నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.

 

View this post on Instagram

 

A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev)

Read more RELATED
Recommended to you

Latest news