Sreeleela : SSMB28 సినిమా సెట్ లో శ్రీలీల ఫొటోలు వైరల్

-

శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరోయిన్. ఒక్క సినిమాతో స్టార్ డమ్ సంపాదించుకుని వరుస ఆఫర్లను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ భామ చేతిలో దాదాపు 10 సినిమాలున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన ఓ సినిమాలో నటిస్తోంది.

SSMB28 సినిమా షూటింగులో శ్రీలీల ప్రస్తుతం బిజీబిజీగా గడుపుతోంది. ఈ బ్యూటీ సెట్ లో ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెడ్ ఔట్ ఫిట్ లో శ్రీలీల మెస్మరైజింగ్ చేస్తోంది. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.

 

SSMB28 సినిమా సెట్ లో శ్రీలీల సందడి చేసింది. రెడ్ కలర్ డ్రెస్సులో శ్రీలీల ఓ లేగదూడతో ఆడుకుంటూ కనిపిస్తోంది. దూడకు గడ్డి తినిపిస్తూ ఇచ్చిన పోజులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన కుర్రాళ్లు మరోసారి మాయ చేసేందుకు శ్రీ రెడీ అవుతోందని కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version