IPl 2023 : ముంబై అభిమానులపై SRH ఫ్యాన్స్ దాడి

-

IPL 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఘోర ఓటమిని చవిచూసింది. నిన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్‌ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ లో టాస్‌ గెలిచి.. బౌలింగ్‌ ఎంచుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. దీంతో మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై..ఈ మ్యాచ్‌ లో విజయం సాధించింది.

హైదరాబాద్‌ ముందు 193 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఉంచగా.. దాన్ని హైదరాబాద్‌ ఛేదించలేక.. 178 పరుగలకే కుప్పకూలింది. దీంతో ముంబై 14 పరుగుల తేడాతో గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్‌ చివరలో సచిన్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ పొదుపుగా బౌలింగ్‌ చేసి.. ముంబైకి విజయాన్ని అందించాడు. ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్‌ మరియు హైదరాబాద్‌ ఫ్యాన్స్‌ మధ్య గొడవ చోటు చేసుకుంది. తాగిన మైకంలో.. వీరు గొడవ కు దిగారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది.

LIVE : Mumbai Indians won by 14 runs | NTV SPORTS

Read more RELATED
Recommended to you

Exit mobile version