సన్ రైజర్స్ హైదరాబాద్ కు బిగ్ షాక్ తగిలింది. సన్ రైజర్స్ హైదరాబాద్ చిట్ట చివరి మ్యాచ్ కు ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరం కానున్నారు. ఇవాళ అతను సొంత గడ్డ అయిన న్యూజిలాండ్ కు ప్రయాణం రానున్నారు.
తన కొడుకు పుట్టిన రోజు ఉన్న నేపథ్యంలోనే.. న్యూజిలాండ్ కు ప్రయాణం రానున్నారు కెప్టెన్ కేన్ విలియమ్సన్. దీంతో కేన్ విలియమ్సన్ స్థానంలో భువనేశ్వర్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
కాగా.. నిన్నటి డూ ఆర్ డై మ్యాచ్ లో ముంబైపై హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో ముంబై పై హైదరాబాధ్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 7 వికెట్లు కోల్పోయి.. 190 పరుగులకే పరిమితమైంది. రోహిత్ శర్మ 48 పరుగులు, ఇషాన్ కిషన్ 43 పరుగులు, డేవిడ్ 46 పరుగులు చేసి.. ధాటిగా ఆడటంతోఓ దశలో హైదరాబాద్ పై ముంబై విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే.. భువనేశ్వర్ 1 వికెట్, ఉమ్రాన్ మాలిక్ 3 వికెట్లు పొదుపుగా బౌలింగ్ చేయడం కారణంగా హైదరాబాద్ విజయ పతాకం ఎగురవేసింది.