Sri Lanka: కొత్త ప్రధాని రణిల్ విక్రమసింఘేకు నిరసన సెగ.. అతన్ని అరెస్ట్ చేయాలని ఆందోళన

-

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో నిరసనలు, ఆందోళనలు తగ్గుమఖం పట్టడం లేదు. ప్రధాని పదవిలో ఉన్న మహీందా రాజపక్సే రాజీనామా చేసిన ఆందోళనకారుల నిరసనలు చల్లారడం లేదు. గురువారం కొత్త ప్రధానిగా రణిల్ విక్రమ సింఘే ప్రధాని బాధ్యతలు తీసుకున్నారు. అయిదు సార్లు ప్రధానిగా పనిచేసిన అనుభవం రణిల్ సొంతం. ఈ అనుభవంతో శ్రీలంకను సంక్షోభం నుంచి బయటపడేస్తారో లేదో చూడాలి. ఇదిలా ఉంటే కొత్తగా బాధ్యతలు చేపట్టిన రణిల్ విక్రమసింఘేకు కూడా నిరసనకారుల నుంచి సెగ తగిలింది. 

ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ఆందోళన చేస్తున్న వారు… అధ్యక్షుడు గొటబయ రాజపక్సే, ప్రధాని రణిల్ విక్రమ సింఘే మధ్య పొలిటికల్ డీల్ జరిగిందని ఆరోపిస్తూ నిరసన ప్రదర్శనకు దిగారు. మాజీ ప్రధాని మహిందా రాజపక్సేను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే మహిందా రాజపక్సేను అరెస్ట్ చేయాలని కొలంబోలోని ఓ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల కొలంబోలోని గాలే ఫేస్ వద్ద నిరసనకారులపై రాజపక్సే మద్దతుదారులు దాడిచేశారు. ఈ ఘటనలో 9 మంది వరకు మరణించారు. ఈ కేసుపై ప్రైవేటు పిటిషన్ దాఖలు కావడంతో కోర్ట్ ఈ నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news