శ్రీలంక నుంచి భారత్ కు వలసలు… ఆర్థిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సింహళ దేశం

-

శ్రీలంక దేశం తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలోొ కూరుకుపోయింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆహార కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. కోడి గుడ్డు ఒకటి రూ.35, కిలో చికెన్ రూ.1000, కేజీ ఉల్లి రూ.200, పాలపొడి రూ.2000,పెట్రోల్ లీటర్ రూ.283, డీజిల్ లీటర్ రూ.220 ఇలా అన్నింటి ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో ఆదేశంలో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. పూర్తిగా సేంద్రీయ వ్యవసాయం వైపు ప్రజల్ని మర్చించేందుకు శ్రీలంక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ నిర్ణయం కారణంగానే దేశంలో ఆహార పంట దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతో పాటు కరోనా కష్టాలు, అప్పులు శ్రీలంకను పీకల్లోతు కష్టాల్లో పడేశాయి. పెట్రోల్ ,డిజిల్ కోసం కిలోమీటర్ల వరకు క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. పెట్రోల్, గ్యాస్ స్టేషన్ల వద్ద ఆర్మీని సెక్యురిటీగా పెట్టారంటే పరిస్థితి తీవ్రత అర్థం అవుతుంది. 

ఇదిలా ఉంటే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న శ్రీలంక జాతీయులు ఇండియాకు అక్రమంగా వలస వస్తున్నారు. సముద్రమార్గం ద్వారా వస్తున్న వీరందరిని ఇండియన్ కోస్ట్ గార్డ్ అదుపులోకి తీసుకుంటోంది. సముద్ర మార్గం ద్వారా రామేశ్వరం, ధనుష్కోటికి శ్రీలంక తమిళులు భారీగా వలస వస్తున్నారు. రామేశ్వరం శరణార్థుల నిలయంలో శ్రీలంక తమిళులకు ఆశ్రయం కల్పిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news