ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ మెగా టోర్నీ 2022 రేపు ప్రారంభం కానుంది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై – కోల్ కత్త నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ ఐపీఎల్ 2022 కోసం బీసీసీఐ అన్ని ఏర్పాట్లను చేసేసింది. అయితే.. ఉగ్రవాదులు ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్ లను టార్గెట్ చేసినట్లు సమాచారం అందుతోంది.
క్విక్ రెస్పాన్స్ బాంబ్ స్వ్కాడ్ టీం ఇచ్చిన హెచ్చరికలతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొందరు ఉగ్రవాదులు మారువేశంలో మ్యాచ్ లు జరుగనున్న స్టేడియాల వద్ద రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. దీంతో స్టేడియాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించింది.
మరోవైపు, ఐపీఎల్ 2022 కి ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్నట్లు ఇంటెలిజెన్స్ ఇన్ పుట్ లు లేవని ముంబై పోలీసులు తెలిపారు. మార్చి 26 నుంచి నగరంలో జరుగనున్న ఐపీఎల్ 2022 క్రికెట్ మ్యాచ్ లకు ఉగ్రవాద బెదిరింపులు ఉన్నట్లు ఏమి లేవని పోలీసులు పేర్కొన్నారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.