యూ ట్యూబ్ లో శ్రీమంతుడు మూవీ అరుదైన రికార్డు… !

-

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మరియు కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ శ్రీమంతుడు. ఇందులో మహేష్ కు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా , జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, రాహుల్ రవీంద్రన్ లు కీలక పాత్రలలో నటించారు. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యు ట్యూబ్ లో సరికొత్త రికార్డును సృష్టించింది. యు ట్యూబ్ లో చూడడానికి అందుబాటులోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 200 మిలియన్ వ్యూస్ దక్కించుకు సంచలనాన్ని నమోదు చేసింది. ఇప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో ఈ సినిమా కూడా ఇన్ని వ్యూస్ ను దక్కించుకున్నది లేదు. ఇక సినిమా లో ఉన్న ఊరి కోసం ఏదైనా చేయాలి అన్న తపన కథానాయకుడితో ఉండడం.. ఆ స్పిరిట్ ను సినిమా ఆసాంతం అలాగే కంటిన్యూ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.

ఈ సినిమాను చూసి ఎందరో తమ సొంత ఊరి కోసం ఏదోకటి చేసేలా ప్రేరేపితం అయ్యారని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version