తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ తర్వాత తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యేది మంత్రి కేటీఆరే నని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఆ అర్హతలు కేవలం మంత్రి కేటీఆర్ కు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు శ్రీనివాస్ గౌడ్.
ఎన్నికల కమిషన్ మా చేతిలో ఉందని బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు… అఘాయిత్యాలు ఎన్ని చేస్తున్నారు అనేది చూడండన్నారు. బీజేపీ నేతలు గెలవలేమని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు…కారు గుర్తును పోలిన గుర్తులు వద్దు అంటే .. అనామకుల తో నామినేషన్ వేయించారని పేర్కొన్నారు.
దొంగ నాటకాలు ఎక్కువయ్యాయని ఆగ్రహించారు. మునుగోడు లో గెలిచి… మేమె అధికారం లోకి వస్తాం అని చెప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నం అని మండిపడ్డారు. గెలిస్తే తర్వాత..మోటర్ల కు ap లో లెక్క మీటర్లు పెడతారు…కాంగ్రెస్ కి మునుగోడు ఎన్నికలు ఇంపార్టెంటా ..? రాహుల్ గాంధీ పాదయాత్ర ముఖ్యమా.? అని నిల దీశారు.