మహేష్ బాబు కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

-

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ శ్రీనివాస్​, సూపర్​స్టార్ మహేష్​ బాబు కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికి తెలిసిందే. SSMB28 వర్కింగ్​ టైటిల్​తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరఇ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కావడంతో సినీ వర్గాల్లోనూ ఈ సినిమాపై చాల ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా టైటిల్​, ఫస్ట్​ లుక్​ని ఉగాది కానుకగా రివీల్​ చేస్తారని అందరు అనుకున్నారు.

 

Superstar Mahesh Babu:'ఎస్ఎస్ఎంబి 28′ కొత్త పోస్టర్

కానీ మేకర్స్​ నుంచి ఎలాంటి అప్​డేట్​ రాకపోవడంతో అభిమానులు అంతా నిరాశ చెందారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి టైటిల్​ ఫిక్స్​ అయ్యిందనీ, త్వరలోనే ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు అయోధ్య‌లో అర్జునుడుతో పాటు మ‌రికొన్ని పేర్లు ప్ర‌చారంలో ఉన్నాయి. త్రివిక్ర‌మ్ త‌న ప్ర‌తి సినిమాకు తెలుగుద‌నం ఉట్టిప‌డే టైటిల్స్ నిర్ణ‌యిస్తుంటారు. ఈ సినిమాకు అలాంటి పొయేటిక్ టైటిల్‌ను మహేష్ మూవీకి ఫిక్స్ చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. SSMB28 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో మ‌హేష్‌బాబుకు జోడీగా పూజాహెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. శ్రీలీల సెకండ్‌ హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ది. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 13న థియేటర్లలోకి రానుంది. రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ మూవీ మేకర్స్.. ఓ పోస్టర్ విడుదల చేసింది. చేతిలో సిగరెట్‌తో మాస్ లుక్‌లో ఉన్నారు మహేష్ బాబు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news