Breaking : గోల్డ్‌ సాధించిన నిఖత్‌ జరీన్‌

-

భారత బాక్సర్లు ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో తమ సత్తా చాటుతున్నారు. తాజాగా స్వర్ణం సాధించింది మన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్. 50 కిలోల కేటగిరీలో నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ గెలిచింది. నేడు జరిగిన ఫైనల్ బౌట్లో నిఖత్ జరీన్ వియత్నాం బాక్సర్ అయిన ఎన్ గుయెన్ థి టామ్ పై 5-0తో సంపూర్ణ ఆధిక్యం సాధించింది. 28-27, 28-27, 28-27, 29-26, 28-27తో నిఖత్ జరీన్ వైపే మొగ్గుచూపారు న్యాయనిర్ణేతలందరూ.

Nikhat Zareen Women's World Boxing Championships Semi-final: Timing and  Live Streaming Info - myKhel

ఈ నేపథ్యంలో, ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిష్ చరిత్రలో నిఖత్ జరీన్ కు ఇది రెండో స్వర్ణ పతకం. ఇంతకుముందు, 2022లో 52 కిలోల విభాగంలో నిఖత్ వరల్డ్ చాంపియన్ గా నిలిచింది. కాగా, తాజా ప్రపంచ చాంపియన్ షిప్ పోటీల్లో భారత్ సాధించిన స్వర్ణాల సంఖ్య మూడుకు పెరిగింది. నిన్న జరిగిన బౌట్లలో నీతూ ఘంఘాస్ (48 కిలోలు), స్వీటీ బూరా (81 కిలోలు) పసిడి పతకాలు సాధించి తమ సత్తాను చాటారు. మరో మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ కూడా భారత్ కు పతకం ఖాయం చేసింది. ఇవాళ జరిగే 75 కిలోల కేటగిరీ ఫైనల్లో లవ్లీనా… ఆస్ట్రేలియాకు చెందిన కైట్లిన్ పార్కర్ తో తలపడనుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news