టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ అర్హతతో 3261 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు…!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. స్టాఫ్ సెలెక్ష‌న్ క‌మిష‌న్ భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు అప్లై చేసుకోచ్చు. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ నోటిఫికేష‌న్ ద్వారా వేర్వేరు విభాగాల్లో 3261 ఖాళీల‌ను భ‌ర్తీ చేయనుంది. అలానే ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తుకు అక్టోబ‌ర్ 25 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌, రీసెర్చ్‌ అసిస్టెంట్‌, గర్ల్స్‌ కేడెట్‌ ఇన్‌స్ట్రక్టర్‌, కెమికల్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ ఇంజినీర్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, టెక్నీషియన్‌, ల్యాబొరేటరీ అటెండెంట్‌, మెడికల్‌ అటెండెంట్‌ వంటి పోస్టులు వున్నాయి. అలానే చ‌లాన్ రూపం లో ఫీజు చెల్లించేందుకు న‌వంబ‌ర్ 1 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలున్నాయి. పోస్టులను టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ విద్యార్హతలుగా ఉన్నాయి చూడండి. ఇక వయస్సు విషయానికి వస్తే.. అభ్యర్థుల వ‌య‌సు 18 నుంచి 30 ఏళ్లుగా ఉంది. అయితే రిజ‌ర్వేష‌న్‌ల ప్ర‌కారం ఆయా విభాగాల వారీగా వయోపరిమితి లో సడలింపులుంటాయి. అలానే ద‌ర‌ఖాస్తు చేసుకొనేందుకు ఫీజు రూ.100. ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ, ఈఎస్ఎం కేటగిరీ అభ్య‌ర్థుల‌కు, మ‌హిళ‌ల‌కు ప‌రీక్ష ఫీజు లేదు. అభ్యర్థులు పూర్తి వివరాలని https://ssc.nic.in/ వెబ్‌సైట్‌ లో చూడొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version