తెలంగానం : స్థాయికి మించిన సాయం కేసీఆర్ కే సాధ్యం!

-

ఆంధ్రా అని కాదు తెలంగాణ అని కాదు
ఏ ప్రాంతం అయినా స‌రే ఎవ్వ‌ర‌యినా స‌రే
ఆయ‌న ద‌గ్గ‌ర‌కు సాయం కోరి వ‌స్తే స్పందిస్తారు
ఆర్థిక చేయూత ఇచ్చి వారి జీవితాల‌లో వెలుగులు
నింపుతారు అనేందుకు తార్కాణాలెన్నో!
ద‌టీజ్ కేసీఆర్

కేసీఆర్ అంటే మంచికి విలువ ఇస్తారు.. ప్రాణం పెడ‌తారు అని అంటారు. అది నిజం! ఆప‌ద అంటే ప‌ద‌ప‌ద‌మ‌ని యంత్రాంగాన్నిపరుగులు తీయించి ప‌నులు చేయిస్తారు. ఆ విధంగా కేసీఆర్ ఇవాళ మ‌రో రికార్డు స్థాయి విజ‌యాన్నే అందుకున్నారు. త‌న ప్ర‌భుత్వం త‌ర‌ఫున సీఎంఆర్ఎఫ్ పేరిట ఎంద‌రినో ఆదుకుని, వారి జీవితాల్లో వెలుగులు నింపి వారికి మ‌రు జ‌న్మ‌ను (పున‌ర్జ‌న్మ‌ను) అందించి తెలంగాణ ప్ర‌జానీకం త‌రుఫున నిలువెత్తు భ‌రోసా అయ్యారు.

తెలంగాణ అనే కాదు తెలంగాణ‌లో ఉంటున్న ఆంధ్రులకు సైతం కేసీఆర్ మ‌రియు కేటీఆర్ సాయం చేస్తూనే ఉన్నారు. ఇక్క‌డ ఉన్న ఆంధ్రా ప్ర‌జాప్ర‌తినిధుల విన్న‌పాల‌ను సైతం సావ‌ధానంగా విని సానుకూలంగా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించి, బాధిత వ‌ర్గాల‌కు ఆర్థిక సాయం తో పాటు నైతిక మ‌ద్ద‌తు అందించి ప్రాంతాల‌కు అతీతంగా ఆయ‌న నిలుస్తున్నారు. సిస‌లు నాయకుడిగా రాణిస్తూ ఉన్నారు.

విభ‌జ‌న అనంత‌రం రెండు తెలుగు రాష్ట్రాల‌లో తెలంగాణ అనూహ్యం అయిన ఫ‌లితాలు సాధిస్తుంది. ఆ లెక్కన పోలిస్తే ఆంధ్రా వెనుక‌బ‌డిపోతోంది. ముఖ్యంగా కేసీఆర్ ప‌ట్టుద‌ల, న‌లుగురికీ మంచి చేయాల‌న్న సంక‌ల్పం కార‌ణంగా ఎక్కువ మందికి ల‌బ్ధి చేకూర్చాల‌న్న ఆశ‌యం ఒక‌టి నెర‌వేరుతోంది. దీంతో ఉమ్మ‌డి రాష్ట్రం క‌న్నా త‌న హ‌యాంలోనే మంచి ప‌నులు కొన్ని, ఆప‌ద‌లో ఉన్న ప్రాణాలు ఆదుకున్న సంద‌ర్భాలు కొన్ని తెలంగాణ చ‌రిత్ర‌లోనే నిలిచి ఉంటాయ‌ని సీఎం కేసీఆర్ ఘంటాప‌థంగా చెబుతున్నారు.ఆయ‌న అనుకున్నారు క‌నుకనే ఆశించిన స్థాయి క‌న్నా ఎక్కువ ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతోంది. ఆప‌ద‌లో దిక్కు తోచ‌ని స్థితిలో ప్ర‌భుత్వం ఓ పెద్ద‌న్న‌గా నిలుస్తోంది. సీఎంఆర్ఎఫ్ అందుకు తోడ్పాటు ఇస్తోంది. సీఎంఆర్ఎఫ్ అంటే చీఫ్ మినిస్ట‌ర్ రిలీఫ్ ఫండ్ ..తెలుగులో ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి అని అర్థం.

ఆ విధంగా సీఎం ఎప్ప‌టి నుంచో చెబుతున్న మాట‌కు కార్య రూపంఇచ్చి ఎవ్వ‌రూ ఇవ్వ‌లేనంత‌గా, బాధిత పీడిత పేద ప్ర‌జ‌లకు ఆరోగ్య విష‌యాల్లో అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో రిలీఫ్ ఫండ్ ను కేటాయించి ఇప్ప‌టిదాకా రెండు వేల కోట్ల రూపాయ‌లు విత‌ర‌ణ రూపంలో ప్ర‌భుత్వం త‌ర‌ఫున అందించి అనూహ్య రీతిలో అంద‌రి మ‌న్న‌న‌లూ అందుకుంటున్న‌రాయ‌న‌. ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న గణాంకాల ప్ర‌కారం నాలుగు ల‌క్ష‌ల మందికి ఆయన ఆర్థిక చేయూత‌ను ప్ర‌భుత్వం త‌ర‌ఫున అందించి మాన‌వ‌త‌ను చాటుకున్నారు.నిధుల‌కు ఎక్క‌డా లోటు లేకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. కొందరు ఎన్ఆర్ఐలు,పారిశ్రామిక వేత్త‌లు, సినీ న‌టులు సైతం సీఎంఆర్ఎఫ్ కు నిధులు ఇస్తూ తమ‌వంతు బాధ్య‌త‌ను నిర్వ‌ర్తిస్తున్నారు.

క‌ష్టం అంటే స్పందించే గుణం..క‌ష్టం అంటే వెనువెంట‌నే యంత్రాంగాన్ని అప్ర‌మ‌త్తం చేసే గుణం..క‌ష్టం అంటే త‌న త‌ర‌ఫున ఏం చేయాలో అవ‌న్నీ చేసి, హామీ ఇచ్చి పంపే ల‌క్ష‌ణం ఇవాళ కేసీఆర్ కే సొంతం.తెలంగాణ రాష్ట్రం ఏర్పాట‌య్యాక ప్ర‌తిరోజూ ఎన్నో విన‌తులు..ప్ర‌తిరోజూ ఎన్నో స‌మ‌స్య‌లు.. వాట‌న్నింటినీ సాల్వ్ చేసేందుకు కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారు.ప్ర‌థ‌మ ప్రాధాన్యం ఇస్తున్నారు.ఈ క్ర‌మంలోనే బాధితుల‌కు అండ‌గానే నిలిచి దేశంలోనే ఆద‌ర్శ‌మ‌య్యారు.

Read more RELATED
Recommended to you

Latest news