స్టేట్ బ్యాంక్ కొత్త స్కీమ్.. టెన్యూర్‌ పూర్తయ్యే వరకు లోన్‌ కట్టక్కర్లేదు..!

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. తాజాగా సీనియర్‌ సిటిజన్లకు శుభవార్త చెప్పింది. సొంతిల్లు ఉన్న సీనియర్‌ సిటిజన్‌ల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్కీమ్ ని తెచ్చింది. పూర్తి వివరాలను చూస్తే..

రివర్స్‌ మోర్టగేజ్‌ లోన్‌ ని తీసుకు వచ్చింది. దీని కింద సీనియర్‌ సిటిజన్లు రూ.కోటి వరకు లోన్‌ వస్తుంది. దీన్ని మీరు టెన్యూర్‌ పూర్తయ్యే వరకు తిరిగి కట్టకపోయినా ఏం కాదు. రిటైర్మెంట్‌ తర్వాత ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండకూడదని దీన్ని తీసుకు వచ్చారు. చాలా మంది వృద్ధులు ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్లకి ఏ బాధ ఉండకూడదని… వారి ఇంటి విలువను లెక్కగట్టి బ్యాంకు లోన్ ఇస్తోంది. జీవిత మొత్తంలో ఈ లోన్ డబ్బును బ్యాంకుకు కట్టాలనే ఒత్తిడి ఉండదు.

లోన్‌ టెన్యూర్‌ 15 ఏళ్లుగా వుంది. అప్పటి దాకా లోన్ చెల్లించమనేమి బ్యాంకు చెప్పదు. కానీసంబంధిత వ్యక్తులు మరణిస్తే బ్యాంకు ఆ ఇంటిని స్వాధీనం చేసుకుంటుంది. లేదంటే వడ్డీ కట్టి వారసులు ఇంటిని విడిపించుకోవచ్చు. 60 ఏళ్లు దాటిన సీనియర్‌ సిటిజన్లు ఈ స్కీమ్ కి అర్హులు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూడా లోన్ ని పొందొచ్చు. అప్పుడు భార్య వయసు 58 దాటాలి. ఈ స్కీమ్ కింద మూడు లక్షల నుంచి కోటి వరకు లోన్ ని పొందవచ్చు.