గుడ్ న్యూస్.. రైల్వేలో స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు..!

-

మరొక ఉద్యోగం కోసం చూస్తున్నారా…? అయితే మీకు గుడ్ న్యూస్. భారతీయ రైల్వే మరో జాబ్ నోటిఫికేషన్ ని విడుదల చేయడం జరిగింది. అర్హత, ఆసక్తి వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. స్టేషన్ మాస్టర్(Station Master) పోస్టుల్ని భర్తీ చేసేందుకు వెస్ట్ సెంట్రల్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్-RRC నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పశ్చిమ మధ్య రైల్వే జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్-GDCE ద్వారా నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్-NTPC (గ్రాడ్యుయేట్) పోస్టుల్ని భర్తీ చేయనుంది.

స్టేషన్ మాస్టర్/ Station Master

అయితే ఈ పోస్టులకి ప్రస్తుతం రైల్వేలో ఉన్న ఉద్యోగులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అర్హులు. అప్లై చేయడానికి 2021 జూలై 25 చివరి తేదీ. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి. డిగ్రీ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు అర్హులు కాదు.

వయస్సు- 2021 జూలై 1 నాటికి జనరల్ అభ్యర్థులకు 40 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 45 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 43 ఏళ్లు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, యాప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

మొత్తం 38 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి. https://wcr.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version