తెలంగాణ మంత్రి కేటీఆర్ చిత్రపటానికి స్టీల్ ప్లాంట్ కార్మికులు పాలాభిషేకం చేసిన ఘటన ఆసక్తికరంగా మారింది. నిన్న విశాఖ ఉద్యమానికి కేటీఆర్ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. అవసరం అయితే విశాఖ వచ్చి తాను ఉద్యమంలో పాల్గొంటానని ఆయన పేర్కొన్నారు..ఈ నేపథ్యంలో కేటీఆర్ మద్దతు తెలపడం మీద కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. హర్షం వ్యక్తం చేస్తూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.. అలాగే తెలుగు వారి ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.
అందరూ కలసికట్టుగా పోరాడి ప్రైవేటీకరణ అడ్డుకుంటామని కార్మికులు చెబుతున్నారు. ఇక స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి కార్మికుల సమ్మె నోటీసు ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని అంటున్నారు. ప్రైవేటీకరణ అంశం తేల్చే వరకు తాము విధులకు హాజరు కాబోమని కార్మికుల సమ్మె నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి క్రమేపీ మద్దతు పెరుగుతోంది నిన్న టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి సైతం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని ఖండించారు. తాను కూడా ఉద్యమానికి మద్దతుగా ఉంటాను అని తెలియజేశారు.