జగన్ పై రాళ్ల దాడి…పోలీసు అధికారులపై వేటు

-

ముఖ్యమంత్రి జగన్ పై రాళ్ల దాడి నేపథ్యంలో ఎన్నికల సంఘం స్పందించింది. ఇద్దరు పోలీసు అధికారులపై బదిలీ వేటు వేసింది. విజయవాడ సీపీ కాంతిరానా టాటా, ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును బదిలీ చేసింది. తక్షణమే వారిని విధుల నుంచి తొలగించాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. వారికి ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పజెప్పాలని ఈసీ ఆదేశించింది. ఈసీకి వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా వారిద్దరిపై వేటు వేసినట్లు తెలుస్తోంది.

కాగా, విజయవాడలో సీఎం జగన్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పాల్గొన్నారు. కొందరు ఆగంతకులు పూలతోపాటు రాయి విసరడంతో జగన్ ఎడమ కంటి దగ్గర గాయమైంది.రాయి బలంగా తగలడంతో కన్ను వాచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version