ఆ భూముల వేలం ఆపండి.. కేసీఆర్ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

-

హైదరాబాద్: హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఖాన్ పూర్ మెట్‌లో శ్మశానికి సంబంధించిన భూముల వేలం ఆపాలని కోర్టు ఆదేశించింది. ఖానాపూర్‌లో భూములను ప్రభుత్వం వేలం వేసిన విషయం తెలిసిందే. మొత్తం 15 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలం వేసింది. అయితే ఈ భూముల్లో 3 ఎకరాల వరకూ శ్మాశాన వాటిక స్థలం ఉందని స్థానికులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ శ్మశానంలో తమ పూర్వీకుల సమాధులున్నాయని, తాము సెంటిమెంట్‌గా భావించే సమాధులను పరిరక్షించాలని స్థానికులు కోర్టుకు విన్నరించారు. ఈ పిటిషన్‌ను శనివారం స్వీకరించిన కోర్టు శ్మశాన స్థలాన్ని తాత్కాలికంగా వేలం వేయొద్దని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

కాగా శుక్రవారం ఖానామెట్‌ భూములను ప్రభుత్వం ఈ వేలం వేసింది. మొత్తం 15.01 ఎకరాల భూమిలోని 5 ప్లాట్లను ఈ-ఆక్షన్‌ ద్వారా విక్రయించింది. అంచనాలకు మించి ధర పలికాయి. ఈ భూముల ద్వారా ప్రభుత్వానికి రూ.729.41 కోట్ల ఆదాయం వచ్చింది. వేలంలో ఎకరం సగటు ధర రూ.48.92 కోట్లుగా ఉండగా.. గరిష్ఠంగా రూ.55 కోట్లు పలికింది. లింక్​వెల్​ టెలీ సిస్టమ్స్​ సంస్థ గరిష్ఠంగా 3.15 ఎకరాలను రూ.153.09 కోట్లకు దక్కించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news