హైదరాబాద్: హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఖాన్ పూర్ మెట్‌లో శ్మశానికి సంబంధించిన భూముల వేలం ఆపాలని కోర్టు ఆదేశించింది. ఖానాపూర్‌లో భూములను ప్రభుత్వం వేలం వేసిన విషయం తెలిసిందే. మొత్తం 15 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలం వేసింది. అయితే ఈ భూముల్లో 3 ఎకరాల వరకూ శ్మాశాన వాటిక స్థలం ఉందని స్థానికులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ శ్మశానంలో తమ పూర్వీకుల సమాధులున్నాయని, తాము సెంటిమెంట్‌గా భావించే సమాధులను పరిరక్షించాలని స్థానికులు కోర్టుకు విన్నరించారు. ఈ పిటిషన్‌ను శనివారం స్వీకరించిన కోర్టు శ్మశాన స్థలాన్ని తాత్కాలికంగా వేలం వేయొద్దని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
ఆ భూముల వేలం ఆపండి.. కేసీఆర్ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ
-