విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే: ధూళిపాళ్ల నరేంద్ర

-

ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత,మాజీ  ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. పదో తరగతి పరీక్ష ఫలితాలకు సంబంధించి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఇంత ఘోరమైన వైఫల్యం ఎప్పుడూ చూడలేదని అన్నారు. టిడిపి హయాంలో 94 శాతం ఉత్తీర్ణత నమోదైతే.. జగన్ హయాంలో అది 67 శాతానికి పడిపోయిందని విమర్శించారు. విద్యాశాఖ మంత్రి లేడని చెప్పి ఫలితాలను ఆపారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా? అని ప్రశ్నించారు.

ఆరు లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తే.. రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారని, దానికి బాధ్యత తీసుకోవాల్సిన విద్యాశాఖ మంత్రి తప్పును విద్యార్థుల తల్లిదండ్రుల మీద చేయడం దారుణమని ఫైర్ అయ్యారు. పదో తరగతి ఫలితాలను చూసి కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఈ ఘటనలు చూస్తే బాధేస్తోంది అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రభుత్వ విధానాల్లో లోపాలవల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని దూళిపాళ్ల మండిపడ్డారు. విద్యా వ్యవస్థను ప్రభుత్వం నాశనం చేసింది అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news