స్ఫూర్తి: చదువవ్వడానికి సమయం ఇంకా ఉందని.. ఆమె ఇలా మొదలెట్టింది.. చూస్తే మీరూ శబాష్ అంటారు..!

-

ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి సాధించాలనే తపన ఉంటుంది. కానీ అందరూ అనుకున్నవి పూర్తి చేయలేరు. కొందరు మధ్యలోనే విడిచి పెడుతూ ఉంటే కొందరు కనీసం మొదలు కూడా పెట్టరు. గట్టిగా అనుకుంటే చాలు మనం గెలవచ్చు. చాలామంది ఈమెని ఆదర్శంగా తీసుకుంటే ముందుకు వెళ్ళడానికి అవుతుంది. పైగా ఈమె అనుకున్న దానిలో సక్సెస్ కూడా అయ్యారు.

మామూలుగా చాలా మంది విద్యార్థులు బీటెక్ ని దాటడం కష్టం అని అనుకుంటూ ఉంటారు. కానీ బీహార్ కి చెందిన ఈ అమ్మాయి బీటెక్ పూర్తవడానికి నాలుగు సంవత్సరాలు పడుతుందని ఈలోగా సంపాదించాలని నిర్ణయించుకుంది.

ఈమె పేరు వర్తికా సింగ్. హర్యానాలోని ఫరీదాబాద్ లో ఒక టీ షాప్ ని ఈమె మొదలు పెట్టింది. ఈ షాపుకి బీటెక్ అని పేరు పెట్టింది. సొంతంగా వ్యాపారం చేయాలనే ఆమె కలని నెరవేర్చుకుంది కూడా. అయితే ఈమె ఫరీదాబాద్ లోని గ్రీన్ ఫీల్డ్ కు దగ్గరలో ఈ టీ షాప్ ని ఈమె ప్రారంభించింది సాయంత్రం 5:30 నుంచి 9 గంటల వరకు ఈ టీ స్టాల్ ఓపెన్ లో ఉంటుంది.

టీ రేట్లు పది రూపాయలు 20 రూపాయలు మాత్రమే. మసాలా టీ లెమన్ టీ వంటివి ఈమె అమ్ముతూ ఉంటుంది ఈమె బిజినెస్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వీడియో కి ఏకంగా 50 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈమెని ఆదర్శంగా తీసుకుంటే సక్సెస్ అవ్వడానికి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version