పంటి నొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కా మీ కోసమే..!!

-

చిన్న పిల్లల్లో కానీ పెద్దవాళ్లలో కానీ పంటినొప్పి తరుచుగా వేదిస్తూ ఉంటుంది. వైద్యులు అందుబాటులో లేని సందర్భంలో పంటి నొప్పి ఎక్కువగా రాక ముందే.. చిన్న పాటి చిట్కాల ను మన పెద్దలు అనుసరించి మనకి అవన్ని చెప్పారు.ఆ నొప్పిని ఎలా తగ్గించుకోవచ్చు. దానికి సంబంధించిన విషయాలను ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం

దంతాలు మనిషి అందానికి ప్రతీక అని చెప్పవచ్చు . ఆహారం బాగా నమిలి తినడానికి దంతాలు ఆయుధంలా పని చేస్తాయి. అయితే చాక్లేట్స్, తీపి పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల, మనం త్రాగేనీటిలో వుండే ప్లోరోసిస్ వల్ల,దెబ్బలు తగలడం వల్ల పళ్లు దెబ్బతింటాయి . దీంతో ఒక్క పన్ను నొప్పి పుట్టినా తట్టుకోలేనంత బాధ కలుగుతుంది. ఏమీ తినలేని పరిస్థితి ఏర్పడుతుంది. దంతాల ఇన్ఫెక్షన్లు, పుచ్చిపోవడం, కొత్త దంతాలు రావడం, దంతాల్లో పగుళ్లు, చిగుళ్ల వ్యాధి తదితర కారణాల వల్ల ఈ నొప్పి ఏర్పడుతుంది. కానీ, ఇది ఒక్కసారి మొదలైందంటే.. అంత ఈజీగా తగ్గదు. ఈ నొప్పి తగ్గాలంటే తప్పకుండా వైద్యున్ని సంప్రదించాల్సిందే. ఒక వేళ వెళ్లలేని పరిస్థితి లో వున్నప్పుడు మన వంటింట్లోనో లేక మన చుట్టుపక్కల దొరికే వాటితోనే .. కొన్ని చిట్కాలు పాటిస్తే పంటినొప్పికి తొందరగా ఉపశమనం దొరుకుతుంది.వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

భోజనం చేసిన తరువాత కొన్నిసార్లు దంతాల్లో పేరుకుపోయిన వ్యర్థాల కారణంగా వచ్చే కావటీస్ ద్వారా కూడా పంటి నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. పంటినొప్పి రాగానే గోరు వెచ్చటి నీటిలో కాస్త ఉప్పువేసి నోట్లో వేసుకొని బాగా పుక్కిలించాలి. దీంతో దంతాల చుట్టూ, మధ్య పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు పోతాయి. నొప్పిని కూడా తగ్గిస్తుంది. ఉల్లిగడ్డ ముక్కను కోసి నొప్పిగా ఉన్న పంటిపై వెంటనే ఉంచుకోవడం వల్ల తొందరగా నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

జామ ఆకుల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి . అందులో కూడా ఎన్నో ఔషధ గుణాలుంటాయి. దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వలన పంటి నొప్పి త్వరగా తగ్గిస్తుంది . పంటినొప్పి వచ్చినప్పుడు జామ ఆకును నమిలితే రసం వస్తుంది. ఆ రసంలో ఉండే గుణాలు యాంటీ మైక్రోబియల్ యాక్టివిటీ ఓరల్ కేర్ లో కూడా హెల్ప్ చేస్తుంది.

ఇక పంటి నొప్పిని తగ్గించడంలో వెల్లుల్లి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే యాంటీ బయోటిక్‌ గుణాలు తీవ్రమైన పంటి నొప్పి నుంచి కూడా వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. వెల్లుల్లిని బాగా దంచి అందులో కొంచెం ఉప్పు లేదా మిరియాల పొడి కలిపి నొప్పిగా ఉన్న పంటిపై ఉంచితే ఫలితం ఉంటుంది.

ఇక చిగుళ్ల నుంచి రక్తం రావడం, చిగుళ్ల నొప్పీ వస్తుంటాయి. ఇలాంటప్పుడు ఆవ నూనెలో ఒక చిటికెడు ఉప్పు ను కలిపి చిగుళ్లపై మర్దన చేస్తే నొప్పీ నుంచి నివారణ కలుగుతుంది. ఇక పంటి నొప్పి ఉన్న సమయంలో తీపి పదార్థాలు, కూల్‌ డ్రింక్స్‌ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. దీనివల్ల సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. లవంగాలు కూడా పంటి నొప్పికి అసలైన చిట్కాగా ఉపయోగపడతాయి. నొప్పి ఉన్న పంటిదగ్గర బుగ్గన లవంగాన్ని పెట్టి నెమ్మదిగా నొక్కాలి .దీంతో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news