Health Tips : ఏ వేసవికాలం ఉదయాన్నే ఇలా చేయండి

-

వేసవికాలం ఉదయాన్నే లేవాలంటే చాల బద్దకంగా ఉంటుంది.. రోజు రోజు ఎండ తీవ్రత కూడా చాలా పెరిగిపోతోంది. అయితే.. మనం లేచే సరికి భానుడు తీవ్ర రూపం దాల్చుతుండడంతో.. ఇంటి బయట అడుగుపెట్టడానికి భయం వేస్తోంది. అయితే.. మన శరీరానికి విటమిన్ డి ఎంతో అవసరం.. అయితే ఈ విటమిన్ డి అనేది.. ఉదయం సూర్యోదయం సమయంలో వచ్చే ఎండలో దొరుకుతుంది. అయితే.. సూర్యరశ్మి ద్వారా అందే ఈ విటమిన్ డి తో మనకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. సూరీడుతో పాటే లేచి.. ఈ నియమాలు పాటిస్తే ఎన్ని లాభాలో చూడండి.

ఉదయం లేవగానే చేసే పనులు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి.లేవగానే ఒకటీ, రెండు గ్లాసుల మంచినీరు తాగాలి. శరీరంలో హైడ్రేషన్‌ పెంచే నీటితో జీవక్రియను ప్రారంభిస్తే మేలు చేస్తుంది.అదనపు శక్తిని పెంచుకోవడానికి అప్పుడప్పుడు నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగితే మరిన్ని ప్రయోజనాలు సమకూరుతాయి.ఉదయం ధ్యానానికి పది నిమిషాల సమయం కేటాయిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది.ఒంటికి తగినంత సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి.శరీరానికి తప్పనిసరిగా శ్రమను అలవాటు చేయాలి.

పొద్దున్నే భారీ బరువులు మోయకుండా తేలికపాటి బరువులు మోయాలి.శరీరంలో రక్త ప్రసరణ పెరిగితే స్ట్రెచింగ్‌ ఎక్సర్‌సైజులు చేస్తే బాగుంటుంది.ప్రోటీన్లతో నిండిన అల్పాహారం తీసుకోవాలి. ఇది రోజంతా శక్తినిస్తుంది.ఇష్టపడే వ్యక్తులతో ఉదయం కొద్దిసేపు గడపాలి. కుటుంబంతో కలిసి టిఫిన్‌ తినడం, స్నేహితులతో కలిసి వ్యాయామం చేయడం మేలు చేస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version