నేను మనిషిగానే ఉంటా.. దేవుడయ్యే ఆశలేదు.. ఆసక్తిరేపుతున్న సందీప్‌ కిషన్‌ మైఖేల్‌ టీజర్‌

-

వెర్సటైల్ స్టార్ సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’. ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్‌. రంజిత్ జయకోడి దర్శకత్వంలోభారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు సందీప్ కిషన్. సరికొత్త ట్రాన్స్ ఫర్మేషన్, సిక్స్ ప్యాక్ బాడీ టెర్రిఫిక్‌గా అనిపించింది. ఈరోజు నిర్మాతలు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. రివెంజ్ డ్రామా అనిపించేలా టీజ‌ర్ ను కట్ చేసారు. అవుట్ అండ్ డార్క్ థీమ్ యాక్షన్ సీన్లు టీజ‌ర్ లో చోటు చేసుకున్నాయి. పగతీర్చుకోవడమే లక్ష్యం తప్ప మంచివాడిగా వుండాలనుకోవడం కాదు అనే హీరో క్యారెక్టరైజేషన్ చెప్పడమే టీజ‌ర్ లక్ష్యంగా కనిపిస్తోంది. టీజ‌ర్ కు ఇచ్చిన బ్యాక్ గ్రవుండ్ స్కోర్ బాగుంది. కొత్తగా వుంది.

సందీప్ కిషన్ కెరీర్ లోనే ఇంత భారీ సినిమా లేదు. దాదాపు ముఫై కోట్లకు పైగా వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమా పలు భాషల్లో విడుదల చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమిళ దర్శకుడు రంజిత్ జ‌య్ కోడి పని చేస్తున్నారు. తమిళంలో రెండు సినిమాలు చేసిన ఈ దర్శకుడు మైకేల్ తీస్తున్న తీరు అప్పుడెే ఇండస్ట్రీలో గట్టిగానే పాకేసింది. దాంతో అవకాశాలు లైన్ కడుతున్నాయి. ఇప్పుడు టీజ‌ర్ విడుదల కావడంతో కచ్చితంగా మంచి దర్శకుడిగా నిలదొక్కుకుంటారు. భరత్ చౌదరి, సునీల్ నారంగ్,రామ్మోహనరావు నిర్మిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ రెండో వారంలో విడుదల చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news