Tees Maar Khan: మరోసారి విలన్ పాత్రలో సునీల్!

-

టాలీవుడ్ సీనియర్ హీరో సాయికుమార్ నటన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎమోషనల్ సీన్స్ లో సాయి కుమార్ నటనకు ఎన్నో అవార్డులు వచ్చాయి. ఇక ఆయన డైలాగ్ డెలివరీకి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాగా, ఆయన తనయుడు ఆది సాయి కుమార్ ఈ సారి సాయి కుమార్ మాదిరిగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ తనదైన స్టైల్ లో ప్లే చేశారు.

‘తీస్ మార్ ఖాన్’గా ఆది సాయి కుమార్..త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో ఆదిసాయికుమార్ కు జోడీగా బోల్డ్ బ్యూటీ RX 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్ నటించింది. కల్యాణ్ జీ గోగన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని విజన్ సినిమాస్ బ్యానర్ పై నాగం తిరుపతిరెడ్డి ప్రొడ్యూస్ చేశారు.

సునీల్, పూర్ణ, కబీర్ దుహాన్ సింగ్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చింది. ఈ సినిమా నుంచి సునీల్‌ లుక్‌ను రివీల్‌ చేసింది చిత్ర బృందం. ఈ పోస్టర్‌ లో సునీల్‌ నెగిటివ్‌ రోల్‌ కనిపిస్తున్నాడు. ఈ లెక్కన మరోసారి సునీల్‌ విలన్‌ అవతారం ఎత్తాడా అనే సందేహాలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news