సొంత గ్రౌండ్‌లో చెమటోడ్చుతున్న సన్ రైజర్స్

-

ఐపీఎల్ లో సన్ రైజర్స్ రాజస్థాన్ రాయల్స్ తో పోరులో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పవర్ ప్లేలో మాత్రం చుక్కలు కనపడ్డాయి. బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ ఓపెనర్లు జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ బంతిని ఇష్టం వచ్చినట్టు బాదడంతో పరుగులు వెల్లువెత్తాయి. 6 ఓవర్లలోనే రాజస్థాన్ స్కోరు 85 పరుగులకు చేరిందంటే బట్లర్, జైస్వాల్ దూకుడు ఎలా సాగిందో మనం తెలుకోవొచ్చు. జోస్ బట్లర్ 22 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 54 పరుగులు చేయగా, జైస్వాల్ 13 బంతుల్లోనే 6 ఫోర్లతో 30 పరుగులు చేశాడు. బంతి ఎలా వచ్చిన కానీ ఈ ఇరువురు మాత్రం బౌండరీ లైన్ దాటించడమే ముఖ్య ఉద్ధేశంగ పెట్టుకున్నారు.

Sunrisers in deep troubles

కెప్టెన్ గా భువనేశ్వర్ కుమార్ కు అనుభవం లేకపోవడం ఈ మ్యాచ్ మాత్రం అస్సలు లలిసి రాలేదు. ఫీల్డింగ్ మోహరింపు అత్యంత పేలవంగా ఉండడంతో, బట్లర్, జైస్వాల్ జోడీ ఈ లోపాన్ని సద్వినియోగం చేసుకుని బౌండరీల వర్షం కురిపించింది. అయితే జోస్ బట్లర్ ను లెఫ్టార్మ్ పేసర్ ఫజల్ హక్ ఫరూఖీ బౌల్డ్ చేయడంతో పరుగుల ప్రవాహానికి అక్కడ అడ్డుకట్ట పడింది .
ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ స్కోరు 8 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 105 పరుగులు. జైస్వాల్ 39 పరుగులతోనూ, కెప్టెన్ సంజు శాంసన్ 11 పరుగులతోనూ ఇంకా క్రీజులో ఉన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news