లేబర్, ఎంప్లాయిమెంట్ తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మాట్లాడితే చాలు ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది. ఇటీవలే రైతుల పైన దుర్భాషలాడుతూ ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు చర్చనీయాంశం అయింది. ఓ సందర్భం లో మంత్రి మల్లారెడ్డి మీరు రైతులా? దున్నపోతులా? అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు. మంత్రి మల్లారెడ్డి తీరు నిరసనగా రైతులు సమావేశంలోనే ఆందోళనకు దిగడంతో ఈ వ్యవహారం కాస్త వేడి వేడిగా మారింది. అయినా కూడా మంత్రి మల్లారెడ్డి మరోసారి తనదైన శైలిలో ప్రసంగం చేశారు. హైద్రాబాద్, అబిడ్స్ లోని రెడ్డి జనసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరుపేద విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, సంఘం ప్రదినిధులతో కలసి 326మంది విద్యార్థులకు రూ.27లక్షల విలువైన ఉపకార వేతనాలను పంపిణీ చేశారు ఆయన. ఈ నేపధ్యం లో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ… ప్రపంచంలోనే నెంబవర్ వన్ ఫేమస్ మంత్రి కేటీఆర్ అని పేర్కొన్నారు.
కేటీఆర్ వల్లే గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్ లాంటి ఎన్నో కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయని పొగిడారు మంత్రి. యువత తీరుపై తనదైన శైలిలో స్పందించిన మల్లారెడ్డి.. చిరిగిన జీన్స్ వేసుకొని పబ్‌లు, హోటల్స్, అమ్మాయిలతో తిరిగితే యువత ఫేమస్ అవుతారని అన్నారు. తాన 23వ ఏటా ఒక సైకిల్ రెండు పాల క్యాన్లతో జీవితాన్ని ప్రారంభించిన తాను.. ముఖ్యమంత్రి కేసీఆర్ దయతో మంత్రిగా ఫేమస్ అయ్యానని పేర్కొన్నారు. తనకు ఏ సంస్థ నుంచి నిధులు అందడం లేదని.. తన వద్ద బ్యాంకు బ్యాలెన్స్, ల్యాండ్ బ్యాంక్, యువత బ్యాంక్ ఉందని తెలిపారు. కష్టపడితేనే యువత ఉన్నతమైన శిఖరాలకు ఎదుగుతారని సూచించారు. దేశంలో ఉన్న బిలియనీర్లంతా పాతికేళ్ల కుర్రాళ్లేనని మల్లారెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఐటి రంగం దేశంలో మొదటి స్థానం లో ఉన్నదని యువతకు అనేక ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని పేర్కొన్నారు మంత్రి మల్ల రెడ్డి.