నేను సంతోషంగా లేను : సూపర్ స్టార్ రజనీకాంత్

-

తాను సంతోషంగా లేనని.. తన జీవితంలో 10 శాతం ప్రశాంతత కూడా లేదని సూపర్ స్టార్ రజనీ కాంత్ అన్నారు. ఎంతో డబ్బు, పేరు ప్రతిష్ఠలు సంపాదించినా.. మనశ్శాంతి లేకపోతే అవన్నీ వృథాయేనని చెప్పారు. చెన్నై నుంగంబాక్కంలోని క్రియ యోగా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎన్నో సినిమాల్లో నటించినా ‘శ్రీరాఘవేంద్ర’, ‘బాబా’ సినిమాలే ఆత్మ సంతృప్తిని కలిగించాయని తెలిపారు. ఆ రెండు చిత్రాల విడుదల తర్వాతే వారిద్దరి గురించి అందరికీ తెలిసొచ్చిందని పేర్కొన్నారు. ఆ చిత్రాలను చూసి తన అభిమానులు ఇద్దరు సన్యాసులుగా మారారని తెలిపారు. కానీ తాను నటుడిగానే కొనసాగుతున్నానని చెప్పారు.

“వయసు మళ్లిన తర్వాత ఆరోగ్యంపై దృష్టి సారించాలి. జ్ఞానాన్ని పెంచుకోవాలి, తల్లిదండ్రులు, గురువుల ఉపదేశాన్ని వినాలి. మంచి ఆలోచనల కోసం పుస్తకాలు చదవాలి. భూత, భవిష్యత్తు కాలాల గురించి చింతించకుండా వర్తమానంపై దృష్టి పెట్టాలి” అని రజనీ పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version