బాలిక దుస్తులపై నుంచి తాకడం కూడా లైంగిక వేధింపులే.. సుప్రీం కోర్ట్ కీలక తీర్పు

-

బాలికలను దుస్తుల పై నుంచి తాకడం కూడా లైంగిక వేధింపు కిందకే వస్తుందని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది. దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపులే అని తీర్పు చెప్పింది. పోక్సో చట్టం ప్రకారం… దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకితే లైంగిక వేధింపుల కిందకు రాదని గతంలో బాంబే హై కోర్ట్ ఇచ్చిన తీర్పును కొట్టేసింది.

ఓ బాలిక దుస్తులపై నుంచి తాకినంత మాత్రాన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పలేమని, చట్టం ఇదే విషయాన్ని విశదీకరిస్తోందంటూ అప్పట్లో బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. లైంగిక ఉద్దేశంతో బాలిక దుస్తులు తొలగించి, లేదా దుస్తుల లోపలకి చేయి పెట్టి నేరుగా తాకితేనే అది లైంగిక వేధింపుల కిందకు వస్తుందని పేర్కొంది. తాజాగా ఈ తీర్పును సుప్రీం కోర్ట్ కోట్టేసింది.

2016లో సతీష్‌ అనే వ్యక్తి బాధిత బాలికకు పండు ఇస్తానని ఆశ చూపి తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ బాలిక ఛాతీని తాకి ఆమె దుస్తులు విప్పడానికి యత్నించాడు. ఆ బాలిక కేకలు వేయడంతో తల్లి అక్కడికి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు కాగా దిగువ కోర్టు నిందితుణ్ని పోక్సో చట్టం కింద దోషిగా తేలుస్తూ పైన పేర్కొన్న శిక్షలు విధించింది. దీనిపై నిందితుడు హైకోర్టును ఆశ్రయించగా పోక్సో చట్టం ప్రకారం దుస్తుల పై నుంచి తాకడం లైంగిక వేధింపుల కిందకు రాన్నట్లుగా తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం ఈ కేసుపై సుప్రీం కోర్ట్ కీలక తీర్పును వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version