న్యూఢిల్లీ: తెలుగురాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ ఎన్వీరమణ విచారించారు. రెండు రాష్ట్రాలకు చెందిన సీనియర్ న్యాయవాదులు జోక్యం చేసుకోవాలని ఆయన సూచించారు. మధ్యవర్తిత్వం ద్వారా రెండు రాష్ట్రాలు సమస్యను పరిష్కరించుకోవాలని ఆదేశించారు. ఏపీ పిటిషన్‌పై విచారణ అవసరం లేదన్నారు. అక్టోబర్ నుంచి గెజిట్ అమల్లోకి వస్తుందని, తాము ఇప్పటినుంచే గెజిట్ అమలు కోరుతున్నామని వాదనల నేపథ్యంలో ఏపీ తెలిపింది. 4 నెలలపాటు నీటిని నష్టపోకూడదని అడుగుతున్నామని ఏపీ పేర్కొంది.
కృష్ణా జలాలపై సీజేఐ ఎన్వీ రమణ కీలక సూచనలు.. ఏపీ పిటిషన్‌పై విచారణ వాయిదా
-