సీజేఐగా జస్టిస్​ చంద్రచూడ్​ వద్దంటూ పిటిషన్.. తిరస్కరించిన సుప్రీం కోర్టు

-

భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్​ను ప్రమాణ స్వీకారం చేయకుండా నిరోధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. పిటిషన్‌ను స్వీకరించడానికి తమకు ఎటువంటి కారణం కనిపించలేదని తెలిపింది. దురుద్దేశంతో పిటిషన్ దాఖలు చేసినట్లు అభిప్రాయపడింది.

పిటిషన్​పై త్వరితగతిన విచారణ చేపట్టాలని సీజేఐ యూయూ లలిత్​తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు ప్రత్యేకంగా ప్రస్తావించారు పిటిషనర్ ముర్సలిన్ అసిజిత్. గురువారం విచారణ చేపట్టాలని సీజేఐ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు పిటిషనర్. స్పందించిన సీజేఐ ధర్మాసనం ఇవాళ మధ్యాహ్నమే ప్రత్యేకంగా విచారణ చేపట్టింది.

జస్టిస్ చంద్రచూడ్​పై పలు ఆరోపణలు చేస్తూ రషీద్ పఠాన్ అనే వ్యక్తి రాష్ట్రపతికి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ వ్యాజ్యం దాఖలు చేశారు పిటిషనర్. అందు​లో లేవనెత్తిన అంశాలకు సంబంధించి ఆధారాలు చూపాలని సీజేఐ కోరారు. అందుకు పిటిషనర్ సరైన ఆధారాలు చూపకపోవడం వల్ల పిటిషన్​ను కొట్టివేశారు. వ్యాజ్యం అంతా తప్పుడు అంశాలతో ఉందని, దురుద్దేశపూర్వకంగా దాఖలు చేశారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Read more RELATED
Recommended to you

Latest news