విద్వేష ప్రసంగాలపై చర్యలు తీసుకోరా..? : కేంద్రంపై సుప్రీం ఫైర్

-

విద్వేష ప్రసంగాలపై చర్యలు తీసుకోకపోవడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంలో తాము స్పష్టంగా గతంలో ఉత్తర్వులు ఇచ్చినా.. పట్టించుకోకపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం కేంద్రంపై తీవ్రంగా మండిపడింది. ఈ ప్రసంగాలపై పదే పదే మార్గదర్శకాలు జారీ చేయాల్సి రావడం న్యాయస్థానానికి ఇబ్బందికరంగా ఉందని పేర్కొంది.

ఈ ఘాటు వ్యాఖ్యలను.. ఈ నెల 5న ‘హిందూ జన్‌ ఆక్రోశ్‌ మోర్చా’ ముంబయిలో నిర్వహించనున్న ర్యాలీపై నిషేధం విధించమంటూ దాఖలైన ఓ అత్యవసర పిటిషన్‌ స్వీకరణ సందర్భంగా గురువారం చేసింది.

మరోవైపు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) పొందిన ఉద్యోగులను పూర్తికాలం పాటు పనిచేసి రిటైరైనవారితో సమానంగా చూడలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. మహారాష్ట్ర రాష్ట్ర ఆర్థిక సంస్థ (ఎంఎస్‌ఎఫ్‌సీ)లో వీఆర్‌ఎస్‌ తీసుకున్న కొందరు ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ రవీంద్ర భట్‌ల ధర్మాసనం గురువారం ఈ వ్యాఖ్య చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news