ఆ దరిద్రపు పని వల్లే ఇలియాన కెరియర్ నాశనం అయ్యిందా..!!

-

టాలీవుడ్ సినీ పరిశ్రమలోకి దేవదాసు సినిమా ద్వారా తన కెరీర్ ని మొదలుపెట్టింది గోవా ముద్దుగుమ్మ ఇలియానా. ఇక ఈ చిత్రంతో మంచి మార్కులు సంపాదించుకున్నది .ఈ ముద్దుగుమ్మ ఆ వెంటనే మహేష్ బాబుతో కలిసి పోకిరి సినిమాలో నటించింది ఈ సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా మారడమే కాకుండా ఈ సినిమా తర్వాత దాదాపుగా కోటి రూపాయలు అందుకున్న మొట్టమొదటి హీరోయిన్గా కూడా పేరు సంపాదించింది. ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరో సినిమాలలో నటించింది.

ఈ క్రేజీతోనే బాలీవుడ్లో తన హవా కొనసాగించాలని అడుగుపెట్టిన ఇలియానా.. ఆ వెంటనే పలు స్టార్ హీరోలతో సినిమాలు నటించి పర్వాలేదు అనిపించుకుంది.. కానీ బాలీవుడ్ లో కూడా కథల ఎంపిక విషయంలో సరిగా లేకపోవడం వల్ల ఇమే కెరియర్ అక్కడ కూడా ఫెయిల్యూర్ గాని మిగిలింది. దీంతో కొన్ని సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్న ఇలియానా మళ్లీ 2018లో తెలుగులో రవితేజ తో కలిసి అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా ఘోరమైన డిజాస్టర్ గా మిగిలింది. ఇక దీంతో మళ్లీ బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టింది.

అయితే ఇలియానాకు సౌత్ ఇండస్ట్రీలో కనిపించక పోవడానికి ముఖ్య కారణం.. ఇలియానా పై తమిళ చిత్ర పరిశ్రమ నిషేధం విధించడమే అన్నట్లుగా సమాచారం. ఇక గతంలో ఒక అగ్ర నిర్మాత సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అడ్వాన్స్ కూడా తీసుకున్నదట.కానీ చిత్రీకరణ షూటింగ్ సమయంలో ఈమె హాజరు కాలేకపోవడంతో ఆమె స్థానంలో మరొక హీరోయిన్ ని తీసుకొని షూట్ చేశారు. దీంతో అడ్వాన్స్ కూడా ఇవ్వాలని కోరగ అమే ఇవ్వలేదట. దీంతో ఆ నిర్మాత కోలీవుడ్ అటు టాలీవుడ్ నిర్మాత మండలికి ఫిర్యాదు చేయడం జరిగింది.దీంతో ఈమె పైన బ్యాన్ విధించినట్లు తెలుస్తోంది. ఇలాంటి దరిద్రం పనిచేయడం వల్లే ఇలియానా కెరియర్ నాశనం అయిందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news