ఎంపీ ర‌ఘురామరాజు అరెస్ట్‌పై.. సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు..

-

వైసిపి రెబెల్ నేత నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ను ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారం పై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని రఘురామ రాజు కుమారుడు భరత్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుసర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు శుక్రవారంసర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఈ శుక్రవారంనాడు విచారణ చేపట్టింది. ఈ కేసుపై విచారణ త్వరిగతిన ముగించాలన్న పిటిషనర్ వాయిదాపై అసహనం వ్యక్తం చేసింది కోర్టు. ఇదేమైనా అంత ముఖ్యమైన విషయమా? అంటూ వ్యాఖ్యానించింది.

ముఖ్యమైన విషయం అయితే రాత్రి 8 గంటలకు కూడా విచారణ చేపడతాం కదా అని కోర్టు వ్యాఖ్యానించింది.ఈ మేరకు శుక్రవారం నాడు ఈ పిటిషన్ పై జరిగిన విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది కి న్యాయమూర్తులు పలు ప్రశ్నలు సంధించారు. ఈ అరెస్టు జరిగి ఇప్పటికే 11 నెలలు గడిచింది కదా ఏ పిటిషన్ ప్రాధాన్యం ఎంతమేర అన్న విషయం తమకు తెలుసు అంటూ వ్యాఖ్యానించింది. ఆ తరువాత ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలంటూ సీబీఐకి నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు ఆ కౌంటర్ పై సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్ కు మరో రెండు వారాల గడువు ఇచ్చింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version