రెజ్లర్ల ఆరోపణలు తీవ్రమైనవే.. దిల్లీ పోలీసులకు సుప్రీం కోర్టు నోటీసు

-

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంలేదంటూ స్టార్‌ రెజ్లర్లు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీం కోర్టు రెజ్లర్లు చేస్తున్న ఆరోపణలు తీవ్రమైనవే అని పేర్కొంది. దీనిపై తమ స్పందన తెలియజేయాలంటూ దిల్లీ పోలీసులకు నోటీసు జారీ చేసింది.

బ్రిజ్‌ భూషణ్‌పై కేసు నమోదు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఏడుగురు మహిళా రెజ్లర్లు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. రెజ్లర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ పిటిషన్‌ వేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినా.. బ్రిజ్‌ భూషణ్‌పై పోలీసులు కేసు నమోదు చేయలేదని పిటిషన్‌దారులు పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. దీనిపై శుక్రవారం (ఏప్రిల్‌ 28) విచారణ చేపడతామని తెలిపింది.

ఈ కేసులో ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచేందుకు జ్యుడిషియల్‌ రికార్డుల నుంచి ఆ ఏడుగురు రెజ్లర్ల పేర్లను తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news