రఫేల్ స్కామ్​పై పిటిషన్​ను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు

-

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం ఇంకా వేడివేడిగానే చర్చకు వస్తోంది. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రఫేల్‌ కొనుగోలు ఒప్పందంలో అక్రమాలు జరిగాయని, ఒప్పందాన్ని రద్దు చేయాలని న్యాయవాది ఎంఎల్​ శర్మ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్​ను సోమవారం సుప్రీంకోర్టు పరిశీలించి, విచారణకు నిరాకరించింది.

తాను వ్యక్తిగత ప్రయోజనాల కోసం పిటిషన్‌ దాఖలు చేయలేదని, అవినీతి వ్యవహారాలను కోర్టు దృష్టికి తీసుకురావడమే తన లక్ష్యమని ఎంఎల్‌ శర్మ కోర్టుకు తెలిపారు. రఫేల్‌ ఒప్పందంలో జరిగిన అక్రమాలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒప్పందంలో భాగంగా ఒక మిలియన్ యూరోలు మధ్యవర్తులకు ఇచ్చినట్లు ఫ్రెంచ్ దర్యాప్తు సంస్థ కూడా చెప్పిందని ఆయన అన్నారు. దీనిపై అక్కడి మీడియా అనేక కథనాలు కూడా రాసిందని పేర్కొన్నారు.

శర్మ వాదనల అనంతరం పిటిషన్​ను వెనక్కి తీసుకుంటారా లేక డిస్మిస్‌ చేయమంటారా అని సీజేఐ జస్టిస్‌ లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే కోర్టు ఉత్తర్వులకు కట్టుబడి ఉంటానని శర్మ తెలిపారు. గతంలో ముగ్గురు సభ్యుల ధర్మాసనం.. ఇదే వ్యవహారంపై విచారణ జరిపిందని, అదే విషయాన్ని పదే పదే లేవనెత్తితే విచారణ జరపడం సాధ్యం కాదని జస్టిస్‌ లలిత్‌ ధర్మాసనం స్పష్టం చేసింది

Read more RELATED
Recommended to you

Exit mobile version