బిగ్ బ్రేకింగ్ : పంచాయతీ ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

-

ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురు అయింది. ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ ను కొట్టివేసింది. వ్యాక్సినేషన్ ను జరపాలని, నాలుగు వారాల పాటు వాయిదా వేయాలని ప్రభుత్వం తరుపున న్యాయవాది ముకుల్ రోహిత్గి కోరారు.

అయితే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయింది కాబట్టి సుప్రీంకోర్టు ధర్మాసనం పిటీషన్ ను కొట్టివేసింది. . ఎన్నికలు వాయిదా వేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇప్పటి దాకా నామినేషన్లు కూడా స్వీకరించనీ ప్రభుత్వ ఉద్యోగులు నామినేషన్లు స్వీకరిస్తారా ? లేదా అనేది చూడల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news